దాసుభాషితం వేదికకు మీ గళం ఇవ్వటానికి ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు.  


అయితే, ముందు కొన్ని విషయాలు మీకు తెలియాలి.

  1. దాసుభాషితంలో గళ కళాకారులు సంస్థ ఉద్యోగులు కారు. వారు Freelance పద్ధతిలో తమ సేవలను అందిస్తారు.

  2. చదివినందుకు పారితోషకం ఉంటుంది. మీరు రికార్డు చేసి పంపినదాన్ని ఎడిట్ చేసిన తరువాత వచ్చే ఆడియోకు (Edited Hour) 
    ₹600 చొప్పున చెల్లిస్తాము. ఈ విషయంలో ఉత్తరప్రత్యుత్తరాలు తావు లేదు.

  3. పుస్తకం ఎంపిక, రైట్స్ ను పొందటం అంతా దాసుభాషితం చూసుకుంటుంది. ఈ విషయంలో మీ సూచనలను, సహకారాన్ని ఆహ్వానిస్తాము.

  4. మీరు దాసుభాషితం కళాకారులుగా స్వీకరించబడితే మీరు ఒక Contract ను sign చేయవలసి ఉంటుంది.

  5. మీరు Home Studio ఏర్పర్చుకోవలసి ఉంటుంది. దాని ఖర్చు సుమారు ₹10 వేల రూపాయలు. ముఖ్యమైన గమనిక. ఒక ఆడియోబుక్ సాకారమవడం లో అనేక అంశాలుంటాయి. మీరు ఎక్విప్మెంట్ కొన్నందుకు బదులుగా దాసుభాషితం ద్వారా మీకు వాయిస్ ప్రాజెక్ట్స్ కచ్చితంగా వస్తాయని దాసుభాషితం ఎటువంటి భరోసా ఇవ్వదు.
 
దాసుభాషితం గళ కళాకారుల వ్యక్తిత్వ వర్ణన (Profile) ఇది:

  1. వీరికి తెలుగు భాష మీద అవ్యాజమైన అభిమానం, గళ కళాకారులవటం మీద అమితమైన ఆసక్తి ఉంటుంది. అయితే, ప్రైవేట్ FM రేడియో ఛానల్ లో Radio Jockey లు అవ్వాలనుకునేవారికి దాసుభాషితం వేదిక సరి అయినది కాకపోవచ్చు.

  2. వీరు వృత్తి గళ కాళాకారులు కారు. ఒకప్పుడు అయిఉన్నా, ఇప్పుడు విశ్రాంత కళాకారులు (ఉ: ఆకాశవాణి లో ఉద్యోగ విరమణ చేసిన వారు). కాబట్టి దాసుభాషితం ఇచ్చే పారితోషకం వాళ్లకు జీవనాధారం కాదు.
         
  3. వీరు వత్తులు సరిగ్గా పలకగలిగిన వారు. (ఉ: 'బాద', 'భాద' కాకుండా 'బాధ' అనే గలిగేవారు)

  4. వీరు Smartphone వాడుతూ, కొంచెం సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు. (మొబైల్ యాప్ డౌన్లోడ్, రికార్డింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయగలగుతారు). 
పైన చెప్పిన వివరాలు, వర్ణన మీకు అనుకూలమైతే, మీరు ఏదన్న మంచి కథ (హాస్యమో, ఆర్ద్రతో, ఎదో ఒక రసం మెండుగా ఉన్న కథ) ఎన్నుకుని, రికార్డు చేసి ఆ ఫైల్ ను artist(at)dasubhashitam(dot)com కి నమూనాగా పంపించండి.

మా బృందం పరిశీలిస్తారు.

మీరు రికార్డింగ్ కొరకు మీ మొబైల్ ఫోనునే వాడచ్చు.
 
మెరుగైన రికార్డింగ్ కోసం ఈ సూచనలు పాటించండి.  

  1. రికార్డు చేసేముందు, ఒకటి రెండు సార్లు ఆ పాఠం బయటకి చదవండి.

  2. మైక్రోఫోన్ ఉన్న హెడ్సెట్ వాడండి.

  3. మైక్రోఫోనును మీ గడ్డం కింద పెట్టుకొండి. అప్పుడు ఊపిరి రికార్డు కాదు.

  4. వత్తులు, ‘స’ ‘శ’ ‘ష’ ‘ల్ల’ ‘ళ్ళ’ 'ణ' అక్షరాల ఉచ్చారణ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

జవాబు కోసం కొంచెం ఓపిక పట్టండి.